పైప్‌లైన్ నిర్మాణానికి భూమిపూజ*

*పైప్‌లైన్ నిర్మాణానికి భూమిపూజ*

కల్లూరు;
V3 టీవీ న్యూస్ కర్నూలు టౌన్:
బుధవారం 

దిన్నెదేవరపాడు నందు నూతనంగా నిర్మించిన ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బిల్డింగ్‌నకు తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి బుధవారం మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి, బొగ్గుల దస్తగిరి భూమిపూజ చేశారు. కాగ సదరు బిల్డింగ్ నగరపాలక పరిధికి దూరంగా ఉండటం కారణంగా, వారి విజ్ఞప్తి మేరకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. దీంతో పై‌ప్‌లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విద్యుత్ శాఖ అధికారులు డిపాజిట్ చేసిన రూ.20 లక్షలతోనే ఈ పనులు చేపడుతున్నారు. అలాగే వారు వినియోగించిన నీటికి ప్రతినెలా రుసుము చెల్లిస్తారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కార్పొరేటర్ వైజ అరుణ, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతి, నగరపాలక సమస్త ఎంఈ శేషసాయి, ఏఈ జనార్ధన్, ట్యాప్ ఇ ఇన్స్పెటర్ రఫిక్ తదితరులు పాల్గొన్నారు.