జనసైనికుల జీవితాలకు భధ్రత, భరోసా, అండా, దండే "జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు యజ్ఞం".!

జనసైనికుల జీవితాలకు భధ్రత, భరోసా, అండా, దండే "జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు యజ్ఞం".! 

(V3 న్యూస్) ఎమ్మిగనూరు జెఎస్పి తాలుకా నాయకులు, క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటీర్ బి సి నాగరాజు.
శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని మండల ఆఫీసు ఆవరణలో జనసేన పార్టీ తాలుకా నాయకులు, క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటీర్ బి సి నాగరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జులై 18 నుండి 28 వరకు జనసేన పార్టీ కి అండగా నిలిచే వారి కోసం లాంఛనంగా చేపట్టిన "జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం" సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని నిర్వహించారు, అనంతరం పత్రికా ముఖంగా ఆయన మాట్లాడుతూ మా ఆరాధ్య దైవం జనసేనాధినేత శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ ఎన్నో త్యాగాలు చేసే వారి కోసం వారి కుటుంబాల క్షేమం కోసం జనసైనికుల జీవితాలకు భధ్రత, భరోసా గా, అండగా, దండగా నిలిచేందుకు చేపట్టిన ఈ మహత్తర, బృహత్తర యజ్ఞమే ఈ "జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం" అని కేవలం ఐదు వందల రూపాయలకు ఐదు లక్షల జీవిత భీమా, యాబై వేల ప్రమాద బీమా సౌకర్యం ను అందజేసే ఏకైక పార్టీ మా జనసేన పార్టీ అని తెలియజేశారు, ఇక్కడ దేశంలో ఎన్నో పార్టీలు కార్యకర్తలను పార్టీ మనుగడ కోసం, ఉన్నికి కోసం పావులుగా వాడుకుని ఎదైనా కార్యకర్తలకు ప్రమాదం సంభవించినప్పుడు వారి వారి కుటుంబాల క్షేమం కోసం, కార్యకర్తల మనోధైర్యం కోసం, వారి జీవితాలకు భధ్రత, భరోసా, అండా, దండా కల్పించలేక పోతున్నాయని పేర్కొన్నారు, అందుకే మా జనసేనాధినేత-శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కోసం అండగా నిలబడే వారికి అండగా నిలబడే "జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం" ..జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం... అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు, కావున జనసేన పార్టీ క్రియాశీలక కొత్త సభ్యత్వ నమోదు చేయించుకోవాలనుకొనే వారు, రెన్యూవల్ కోసం సెల్ నెం. 9908337972 కు ఫోన్ చేసి సభ్యత్వ నమోదు పొందగలరని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు వి. నర్సింహులు ఏనుగుబాల సురేష్, మసీద్పురం జెట్టెప్ప, రమాకాంత్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.