తల్లి తండ్రుల మరణించడంతో అనాదులైన మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ,

తల్లి తండ్రుల మరణించడంతో అనాదులైన మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ,

ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు స్వచ్చంద సంస్థలు ఆదు కోవాలి 

వి 3న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండలం గూళ్యం గ్రామము చెందిన పింజరి కాశీంసాబు ,శేకమ్మ దంపతులు వీరికి ముగ్గురు  అమ్మాయిలు సంతానం (1) ఆసాబి  వికలాంగురాలు వయస్సు 15 (2) సబియా వయస్సు 10 (3) ఆప్రిన్ వయస్సు 8 సంవత్సరాలు తండ్రి కాశీంసాబు గత నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయారు అప్పటినుండి ఆమె పిల్లలతో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చినది  తల్లి కూడా  అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం 8 గంటలకు గూళ్యం గ్రామము లో మరణించింది  తల్లి తండ్రుల ఇద్దరు మరణించడంతో ముగ్గురు అమ్మాయిలు అనాదులుగా మిగిలారు ఈ ముగ్గురు జీవనం సాగేందుకు చాలా కష్టమైన విషయం,పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు కావున ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ,ప్రజా సంఘాలు,స్వచ్చంద సంస్థలు, మనసున్న ప్రతి ఒక్కరు కూడా  ఆదు కోవాలి  ఎమ్మార్పీఎస్ తరుఫున కోరుచున్నాము .