SC,ST BC సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో (బాలికలు) బి .క్యాంప్ నుండి కే.వి.ఆర్ కళాశాలకు వెళ్ళుటకు బస్సు సౌకర్యం కల్పించాలి

SC,ST BC సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో (బాలికలు) బి .క్యాంప్ నుండి కే.వి.ఆర్ కళాశాలకు వెళ్ళుటకు బస్సు సౌకర్యం కల్పించాలి అని చెప్పి  డిపో మేనేజర్  B.సర్దార్ హుస్సేన్  కి  పారా లీగల్ వాలంటీరు కే. చిన్నయ్య   వినతి పత్రం ఇవ్వడం జరిగినది. సాంఘిక సంక్షమ హాస్టల్స్ లో దాదాపుగా 500 మంది విద్యార్థునులు ఆటోలో ప్రయాణిస్తున్నారు వారు  ఒక్కొక్క ఆటోలో 20 మంది దాకా ప్రయాణం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. అందు నిమిత్తము ఏపీఎస్ఆర్టీసీ వారు ఒక బస్సు  సౌకర్యం కల్పించి విద్యార్థునులకు సకాలంలో కళాశాలకు  క్షేమంగా తీసుకొని వెళ్ళుటకు సహకరించాలని      కోరుతున్నాము. ఈ యొక్క ఆసౌకర్యంని గుర్తించి ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్  బస్సు సౌకర్యం కల్పించుటకు సానుకూలంగా స్పందించడం జరిగింది.