పెద్ద పాపకు పించను మంజూరు చేయిస్తా...
ఐసిడిఎస్ పిడి వెంకట లక్ష్మమ్మ.
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-అనాధ పిల్లల పోషణ, చదువుల పైన ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాగోగులు చూసుకుంటామని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఈ సందర్భంగా హలహర్వి మండలం గూళ్యం గ్రామం నందు అనాధ పిల్లల వాళ్ల స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. వాళ్ల బంధువుల అంగీకారం మేరకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పిల్లల పోషణ, చదువులు తదితర వాటిని చూసుకుంటామని తెలిపారు. అలాగే పించను మంజూరు చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ మద్దమ్మ, సూపర్వైజర్ చందన, అనాధ పిల్లల బంధువులు, అనాధ పిల్లలు, తదితరులు.