ఆటో డ్రైవర్లకు ఆటో టాప్ నెంబర్ల ఐడి కార్డులను అందజేసిన ... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ .

ఆటో డ్రైవర్లకు ఆటో టాప్ నెంబర్ల ఐడి కార్డులను అందజేసిన ... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ . 


వి 3 టివి న్యూస్ కర్నూలు :-

గురువారం కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ కర్నూలు ఎస్టీబిసి కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల కు ఆటో టాప్ నెంబర్ల ఐడి కార్డులను అందజేశారు. 

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. 

ఆటోలు బళ్లారి చౌరస్తా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు టౌన్ లోని స్కూలు వంటి ముఖ్యమైన కూడళ్ళలో ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా ఆటోలు నడపవద్దని సూచించారు. 

కర్నూలు పట్టణంలో తిరిగే ఆటోలు క్రమశిక్షణతో ఉండాలన్నారు. 

రికార్డులు లేనటువంటి మరియు ర్యాష్ డ్రైవింగ్ చేసే ఆటో వాళ్ళ వివరాలను తెలిపి పోలీసులకు సహకరించాలని కోరారు. 

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుటకు మరియు నేరాలను అరికట్టుటకు గాను, ఆటోల రిజిస్ట్రేషన్ లులేనివి, టాప్ నెంబర్ లు లేని, సరైన ధృవ పత్రాలు లేని ఆటోల పై MV యాక్టు క్రింద చర్యలు తీసుకుంటామన్నారు.

ఆటోనే జీవనోపాదిగా ఉన్న ఆటో డ్రైవర్ల ను దృష్టిలో ఉంచుకుని ఆటో యూనియన్ నాయకుల కోరిక మేరకు ఆటోల దృవ పత్రాల ను పరిశీలించి, ఆటోలకు కొత్తగా ఆటో టాప్ నెంబర్లు కలిగిన క్రమ సంఖ్య ఐడిలను అందజేశామన్నారు.

ధృవపత్రాలు లేని ఆటోల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. 

కర్నూలులో తిరిగే ప్రధాన రద్దీ ప్రదేశాలలో , ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా క్రమపద్దతిలో వెళ్ళాలని ఆటో డ్రైవర్లకు ఆదేశించారు.  

ప్రమాదాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. రాంగ్ పార్కింగ్ చేయరాదు. 

ఆటో డ్రైవర్స్ తప్పనిసరిగా యూనిఫామ్ , లైసెన్సులు, వాహనాల కు సంబంధించిన ధృవ పత్రాలు కలిగి ఉండాలి.

అతి వేగం, మద్యం సేవించి ఆటో నడిపేవారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. 

కర్నూలు నగరంలో తిరిగే ఆటోల వలన కలిగే ప్రమాదాలు , ప్రజలకు కలిగే ఇబ్బందులపై ట్రాఫిక్ పిఎస్ కు వచ్చిన బాధిత ఫిర్యాదుల మేరకు కర్నూలు ట్రాఫిక్ పోలీసులు ఆటో యూనియన్ లీడర్లతో సంప్రదించి ఆటో డ్రైవర్ లేదా ఓనర్ యొక్క ఆధార్ వివరాలతో ఉన్న వ్యక్తి ఫోటోతో పాటు అడ్రస్ కలిగిన స్కానర్ కలిగిన టాప్ నంబర్ ను ఇవ్వడం జరిగిందన్నారు.  

 ఈ సందర్భంగా ఆటో యూనియన్ లీడర్స్ హర్షం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ విజయశేఖర్, ట్రాఫిక్ సిఐ గౌతమి, కర్నూలు టు టౌన్ సిఐ ఇంథియాజ్ భాషా , ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.