నగరపాలక సంస్థ;
V3టీవీ న్యూస్ కర్నూలు టౌన్:
ఇంటి పరిసరాలలో మురుగునీటికి చోటు ఇస్తే, దోమపోటుకు గురి కావాల్సి వస్తుందని నగరపాలక అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ అన్నారు. శుక్రవారం నగర వ్యాప్తంగా స్ప్రేడ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి, సచివాలయ కార్యదర్శుల ద్వారా విసృతంగా అవగాహన కల్పించినట్లు రామలింగేశ్వర్ పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలు తమ ఇంటి పరిసరాలలో పాత టైర్లు, బాటిళ్లు, కుండీలు, గచ్చు వంటి వాటిల్లో నిరుపయోగ నీటిని వెంటనే తొలగించాలని కోరారు. అలాగే వినియోగించే నీళ్ళపై తప్పనిసరిగా మూతలు ఉంచాలని, సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ కోరారు.