ఉపాధి కూలీలు వెంటనే చెల్లించాలని, ధర్నా


ఉపాధి కూలీలు  వెంటనే చెల్లించాలని, ధర్నా

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-  పన్నెండు వారాలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ హాలహర్వి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు మంగళవారం బాపురం, పచ్ఛారపల్లి గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు.ఉపాధి కూలీలు,మునిస్వామి మాట్లాడుతూ పన్నెండు వారాలుగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు వేతనాలు అందలేదు మా కుటుంబాలు ఆకలి మంటలతో విలవిలలాడిపోతున్నారు అధికారులు పనులు కల్పిస్తున్నందుకు తగినట్లుగా కూలీలు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ సి దేవదాసు కు వినతి పత్రం అందజేశారు వెంటనే వేతనాలు చెల్లించాలని అధికారులను డిమాండ్ చేశారు.