డయోరియాను ఆపండి పై అవగాహన

డయోరియాను ఆపండి పై అవగాహన 

మద్దికేర మండలం మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు, ఆరోగ్య కార్యకర్తలకు, సూపర్వైజర్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణిలు డయోరియాను ఆపండి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మాట్లాడుతూ జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు రెండు నెలల పాటు డయోరియాను ఆపండి ,స్టాప్ డయోరియా క్యాంపెయిన్ నిర్వహించబడుతున్నట్లు , ఈ కార్యక్రమంలో అప్పుడే పుట్టిన పిల్లలనుండి ఐదు సంవత్సరంల వయసు గల పిల్లలు కలిగి ఉన్న ప్రతి ఇంటికి ఆశా కార్యకర్తలు గృహ సందర్శన చేసి తల్లులకు, మహిళలకు అతిసారంపై అవగాహన కలిగించాలని తెలిపారు .ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో భాగంగా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అతిసార లక్షణాలు ఎక్కడైనా ఎవరికైనా ఉన్నట్లు అయితే అటువంటి బిడ్డకు 14 రోజులపాటు జింక్ మాత్రలు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు సరిపడే ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఆరోగ్య విద్యా ప్రచారంలో భాగంగా అంగన్వాడీలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మరియు పాఠశాల బడి పిల్లలకు చేతుల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఆరోగ్య విద్య అవగాహన కలిగించాలని తెలిపారు .హెల్త్ ప్రొవైడర్లు తాగునీటి వనరులను గుర్తించి పరీక్షలు నిర్వహించి నీటి నాణ్యతను పరీక్ష చేయాలని తెలిపారు. ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఓ ఆర్ ఎస్ కార్నర్లను ఏర్పాటు చేసి ప్రజలకు స్టాప్ డయోరియా పై ఆరోగ్య విద్య అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు ,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా ,ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమ్మ, సూర్యనారాయణ ,హెల్త్ ప్రొవైడర్లు, ఆరోగ్య కార్యదర్శిలు ఆశా కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు