టిటిడి ఇఓ జె.శ్యామలరావు ని మర్యాద పూర్వకంగా కలసిన తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి*

*టిటిడి ఇఓ జె.శ్యామలరావు ని మర్యాద పూర్వకంగా కలసిన తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి* 

తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ మద్దిల గురుమూర్తి సోమవారం సాయంత్రం టిటిడి పరిపాలన భవనం లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె.శ్యామలరావు ను మర్యాద పూర్వకం గా కలిశారు. తిరుపతి స్విమ్స్ లో డి ఆర్ డి ఓ - డెబెల్ తో చేసుకున్న ఆధునాతన వైద్య పరిశోధన ఎం ఓ యు ,భారత రక్షణ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ- డెబెల్ ఎం ఓ యు ను అమలు చేయాలని, డీ.ఆర్.ఎం.ఎల్ తో ఇంప్లాంట్స్ తయారీ కి ఎం.ఓ.యు చేసుకునేందు కు చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వల్ల పేదలకు, శ్రీవారి భక్తుల కు మరిన్ని అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటు లో కి వస్తాయని ఈవో దృష్టి కి తెచ్చారు. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఉన్న శ్రీవాణి టిక్కెట్ కౌంటర్ లో వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విమానాల్లో వచ్చే భక్తుల కోసం కేటాయించాలని కోరారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు తిరుపతి లో హిందూ వైదిక సంప్రదాయల ప్రకారం హోమ క్రతువులు నిర్వహించుకునేందుకు టిటిడి ఆధ్వర్యం లో యాగశాల నిర్మించాలని , పూజలు అన్ని ఒకే చోట నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్విమ్స్ కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గుర్తింపు ఫైల్ సీఎంవో లో వెంటనే అప్రూవల్ చేయించి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు త్వరిత గతిన పంపేలా చూడాలని కోరారు. ఈ ఫైల్ ఆమోదం పొందితే స్విమ్స్ కి సుమారు రూ.800 కోట్లు నిధులు మంజూరు కి అవకాశం ఉంటుందని అన్నారు.