జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలి :

జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు రాయితీ  కల్పించాలి : 

జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదే 

 ప్రజా దర్బార్ హాలహర్వి :- అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టు  పిల్లలకు ప్రభుత్వ కార్పోరేట్ పాఠశాలలో కళాశాలలో 60 శాతం ఫీజు రాయితీ అవకాశాన్ని కల్పించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ మల్లికార్జున, హాలహర్వి మండల అధ్యక్షులు ఉమాపతి, ఉపా అధ్యక్షులు పచ్ఛారపల్లి జనార్థన  డిమాండ్ చేశారు. సోమవారం హాలహర్వి మండలం లోని  స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో  తహశీల్దార్ బ్యూలా, ఎంపీడీవో కార్యాలయంలోని ఇ ఆర్ డి ఓ మల్లికార్జున , యం ఆర్ సి కార్యాలయం ఎంఈఓ ఈరన్న  లకు వినతి పత్రాన్ని అందజేసిన. అనంతరం వారు మాట్లాడుతూ
జిల్లాలో అనేకమంది జర్నలిస్టులో తమ పిల్లలను చదివించుకోవడానికి అనేక వ్యయ ప్రయాసలు పడుతున్నారని. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు భరోసాగా వారి పిల్లలు చదువుతున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజు 60 శాతం రాయితీ కల్పించాలి.  గత  ప్రభుత్వ వైఖరి వల్ల అనేక మంది జర్నలిస్టులు తమ అక్రిడేషన్ హక్కు కోల్పోయారునీ జిల్లాలో దాదాపు 70 శాతం మంది అర్హత కలిగిన జర్నలిస్టులు అక్రెడిటేషన్ గత ప్రభుత్వం వైఖరి, నిరంకుశ విధానం వల్ల కోల్పోయారనీ విమర్శించారు . జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని అక్రిడేషన్ ప్రామాణికం కాకుండా,  వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలు చదువుతున్న స్కూల్లో 60 శాతం రాయితీ కల్పించేలా, ప్రతి స్కూల్ కి విద్యాశాఖ అధికారి ద్వారా సర్కులర్ జారీ చేయవలసిందిగా అధికారులను కోరడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం చేపట్టిన జర్నలిస్టు  హౌసింగ్ కు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు జర్నలిస్టులకు లబ్దిచేకూర్చలేదు , జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను ఆపేల చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో  పుల్లయ్య శెట్టి, వీరేష్, జాన్ , షాసాబ్  పాల్గోన్నారు.