V3టీవీ న్యూస్ కర్నూలు టౌన్:
నగర పాలక సంస్థ;
15-07-2024
సోమవారం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రతి అర్జీని సత్వరమే పరిష్కారిస్తామని నగరపాలక మేనేజర్ చిన్న రాముడు అన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 13 అర్జీలు వచ్చినట్లు మేనేజర్ పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో టీడ్కో అధికారి పెంచలయ్య, సూపరింటెండెంట్ స్వర్ణలత, ఆర్ఐ సాధిక్, సినియర్ అసిస్టెంట్ రామకృష్ణ, ఉమోష్, మల్లెపోగు కుమార్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
*వచ్చిన అర్జీలలో కొన్ని...*
1. చెక్ పోస్ట్ సమీపంలోని తమ కాలనీ నందు రహదారి వేయాలని ప్రభుత్వ వాహన డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
2. తమ కాలనీ నందు పైపులైన్ లేక ఇబ్బందిగా ఉందని కావున పైప్ లైన్ వేయాలని భ్రమరాంబ నగర్ వాసులు కోరారు.
3. సరస్వతి నగర్ నందు శిథిలావస్థకు చేరిన డ్రైనేజీ కాలువను పునర్నిర్మాణం చేపట్టాలని స్థానిక కాలనీ వాసులు కోరారు.
4. టీడ్కో ఇంటి కోసం చెల్లించిన నగదు వెనక్కి చెల్లించాలంటూ ఏ.చిట్టిగోవర్ధనమ్మ కోరింది.
5. సాంకేతిక కారణాల వల్ల కోల్పోయిన తన వికలాంగ పింఛన్ తిరిగి మంజూరు చేయాలని సలావుద్దీన్ వినతి ఇచ్చారు.
6. తన స్థలానికి రీసర్వే చేయాలని ఎఫ్‌సిఐ కాలనీకి చెందిన హెచ్‌బి రోజరాణి కోరారు.
7. తనకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని టెలికం నగర్‌కి చెందిన సి.సుంకన్న ఫిర్యాదు చేశారు.