ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదంతో హాలహర్వి ఎమ్మార్పీఎస్ నాయకులు.

ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదంతో 
హాలహర్వి ఎమ్మార్పీఎస్ నాయకులు.
ఎమ్మార్పీఎస్ మండల నాయకులు కిషోర్, మహేష్,సుధాకర్
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-స్థానిక మండల పరిధిలోని ఎస్సీ ఎస్టీ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు కిషోర్,మహేష్,సుధాకర్, ఆధ్వర్యంలో అంబేద్కర్ గ్రహానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు, ఈరోజు 1/8/2024.న ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎమ్మార్పీఎస్ అన్ని శ్రేణులు స్వాగతిస్తున్నాము అన్నారు,గత 30 సంవత్సరాలు పైబడి ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఎస్సీ వర్గీకరణ ఏ బి సి డి కోసం అలుపెరుగని పోరాటం చేయడం జరిగింది,ఎస్సీ లో ఉన్న 59 ఉపకులాలను ఏబిసిడిలుగా వర్గీకరించి ఎస్సి లో ఉన్న 59 కులాలకు రిజర్వేషన్ ఫలాలను సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో చేసిన ఉద్యమమే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.ఈ పోరాటం 1994న జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం నుండి ఇండియా అత్యున్నత న్యాయస్థానం అయినా సుప్రీంకోర్టుకు మాదిగ కుల పెద్దలు చేర్చడం జరిగింది, ఎస్సీ వర్గీకరణకై మాదిగ మాదిగ ఉప కులాలు ఎన్నో ఏళ్ల నుండి ఎస్సీ లో ఉన్న తారతమ్యాన్ని సక్రమం చేసి ఏ బి సి డి లు గా ఎస్సీ వర్గీకరణను వర్గీకరించి విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో ఎస్సి లో ఉన్న 59 ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం సమన్యాయం జరుగాలని ఆకాంక్షతో చేసిన ఉద్యమమే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కావున ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం , ఈకార్యక్రమంలోమునిస్వామి,జానప్ప,ముక్కన్న, రాజేష్,విటల్, బాబురావు, భాస్కర్, పోలయ్య,తదితరులు పాల్గొన్నారు,