కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ... జె. బాబు ప్రసాద్ .

కర్నూలు  డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ...  జె. బాబు ప్రసాద్ .


వి 3 టివి న్యూస్ కర్నూలు :-
కర్నూలు  డీఎస్పీగా  జె. బాబు ప్రసాద్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

కర్నూలు డిఎస్పీ గా ఇదివరకు పని చేస్తున్న  పూర్వపు డిఎస్పీ కె. విజయశేఖర్  ఎపి హెడ్ క్వార్టర్ కు బదిలీ కావడం  జరిగింది.

డిఎస్పీ జె. బాబు ప్రసాద్  గురించి....

సీఐగా ...

కర్నూలు టు టౌన్ పోలీసు స్టేషన్,  ఆత్మకూరు పోలీసుస్టేషన్, కర్నూలు  స్పెషల్ బ్రాంచ్ , కర్నూలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లలో పని చేశారు. 
 
డిఎస్పీ గా...

కర్నూలు స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు జిల్లా గుడూరు పోలీసుస్టేషన్ , చిత్తూరు  దిశ పోలీసు స్టేషన్ , 2024 ఫిబ్రవరి నుండి  కర్నూలు మహిళా పోలీసుస్టేషన్ లలో  పని చేశారు.
కర్నూలు  మహిళా  పోలీసు స్టేషన్ డిఎస్పీ గా పని చేస్తూ ఇటీవల జరిగిన సాధారణ డిఎస్పీల బదిలలో  కర్నూలు డిఎస్పీ గా రావడం జరిగింది.
కర్నూలు సబ్ డివిజన్ లో నేరాలు జరగకుండా  ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా  కర్నూలు  డిఎస్పీ జె.బాబు ప్రసాద్  తెలిపారు.