ప్రజల ప్రాణాలు కంటే ప్రభుత్వ ఖజానా నింపుకోవటమే ముఖ్యమా బాబు గారు!?" మువ్వల

 "ప్రజల ప్రాణాలు కంటే ప్రభుత్వ ఖజానా నింపుకోవటమే ముఖ్యమా బాబు గారు!?" మువ్వల

 గత ప్రభుత్వం పూర్తిగా మద్యం నిషేధం చేస్తామని చెప్పీ, విషపూరితమైన నాసిరకం మందుని తయారుచేసి ప్రజల మీదకు వదిలిందని. తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోలో "మద్యం ధరల నియంత్రణ- విషపూరితమధ్యం బ్రాండ్లు రద్దు" చేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఈ కూటమి ప్రభుత్వం చెప్పినది ఒకటి చేస్తున్నది ఇంకొకటి అని, ప్రజల ప్రాణాలు కంటే ప్రభుత్వ ఖజానా నింపుకోవడమే ముఖ్యంగా పనిచేస్తుందని బొబ్బిలి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ షాపు లైసెన్స్ ద్వారా ఈ ప్రభుత్వానికి 1900 కోట్ల రూపాయలు ఆదాయం ఖజానాకి సమకూరుందని. అలాగే 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ అమ్మకాలు ద్వారా ఖజానాకి సుమారుగా 28 వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు ఉండవు కాబట్టి గతంలో దరఖాస్తుల ద్వారా సమకూరిన 1900 కోట్లు ఎలా ప్రజల దగ్గర నుంచి రాబట్టాలని ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచన చేసి పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చి ఖజానాకి ఆదాయం సమకూర్చే ఆలోచన చేయడం సిగ్గుచేటని, గతంలో లిక్కర్ షాప్ యజమానుల దగ్గర నుంచి ఈ పర్మిట్ రూములకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని, ఈ విధానమే ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాలని దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకి వందల కోట్లు ఆదాయం వస్తుందని ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. ఈసారి పర్మిట్ రూములు అనుమతి రెండు విధాలుగా విభజించి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న లిక్కర్ షాపులకు 7.5 లక్షల రూపాయలు మిగతా చోట్ల ఐదు లక్షల రూపాయలు వసూలు చేయాలనే ఆలోచన చేస్తుందని, ఈ విధానం వల్ల ప్రజలు మరింత మద్యానికి బానిసలై ఇల్లు,వొళ్ళు గుల్ల చేసుకుని రోడ్డును పడతారని, మేనిఫెస్టోలో పొందుపరిచిన మద్యం విధానానికి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి పొంతనలేదని ఏరు దాటాక తెప్పని తగలబెట్టే విధంగా ఉందని ఎద్దేవ చేశారు. పర్మిట్ రూముల విధానాన్ని విరమించుకోవాలని, మీరు చెప్పినట్లుగా మద్యం ధరల నియంత్రణ విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.