కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
కర్నూలు జూలై 17:- కర్నూలు ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు...
నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ నుండి రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలను విడుదల కార్యక్రమానికి వెళ్లేందుకు జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి మ. 12.37 నిమిషాలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు.. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి వర్యులు గారికి ఘనంగా స్వాగతం పలికారు.. స్వాగతం పలికిన వారిలో ఎమ్ఎల్ సి బిటి నాయుడు, కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి, పత్తికొండ ఎంఎల్ఏ శ్యామ్ బాబు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కురువ సంక్షేమ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రాష్ట్ర వాల్మీకి సంక్షేమ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, PACS చైర్మన్ రమణ, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కా రెడ్డి, మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, మాజీ ఎంఎల్ సి ఇక్బాల్, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ నాయకులు తుగ్గలి నాగేంద్ర,వీరభద్ర గౌడ్, తదితరులు ఉన్నారు..