*ప్రజలకు సుపరిపాలన అందించటమే మా లక్ష్యం*

❇️ *ప్రజలకు సుపరిపాలన అందించటమే మా లక్ష్యం*


❇️ *సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా జామి మండలం, లక్ష్మిపురం గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు ఇంటింటికి తిరిగి ఏడాది పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మహిళలకు వివరించి కరపత్రాలను పంపిణి చేశారు. ఏడాది పాలన పై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గ్రామంలోని సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ" గత వైసీపీ పాలకులు అరాచక పాలనతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి సంక్షేమాన్ని అందించటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ఒక్కొక్కటికిగా అమలు చేస్తున్నామని, ప్రజలకు మేలు చేయటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించి వాటిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు..*

*ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీ లక్ష్మి,ప్రధాన కార్యదర్శి వర్రి రమణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్నాయుడు,క్లస్టర్ కో ఇంచార్జ్ సన్యాసినాయుడు,సర్పంచ్ జ్యోతి, ఝాన్సీ,కొత్తలి అప్పలనాయుడు, నాయుడు,తదితరులు పాల్గోన్నారు...*