*బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలి...*
*చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్...*
కర్నూలు, జులై 24:-బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్ ల వీడియో కాన్ఫరెన్స్ సమావేశం లో పేర్కొన్నారు.
గురువారం సాయంకాలం చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ లతో నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర పి-4 ఫౌండేషన్,సానుకూల ప్రజా దృక్పథం, RTGS లెన్స్‌పై సూచనలు,సిటీ గ్యాస్ పంపిణీ లో సమస్యల పై రివ్యూ చేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ... పి 4 ఫౌండేషన్ కు సంబంధించి గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని తెలిపారు, దత్తత కార్యక్రమం త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. మార్గదర్శి ఆన్లైన్ లో దత్తత కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు మొత్తం గ్రామం దత్తత క్రింద కు వస్తోందని, ఈ అంశాన్ని సరిచేయాలని కలెక్టర్ కోరారు. అలాగే ఒక మార్గదర్శికి కొన్ని కుటుంబాలకు మాత్రం పరిమితం చేయాలని చీఫ్ సెక్రటరీ ని కలెక్టర్ కోరారు.
పాజిటివ్ పర్సెప్షన్ లో భాగంగా విద్యుత్ శాఖకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని కలెక్టర్ చీఫ్ సెక్రటరీ కి వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జె సి డా.బి.నవ్య, సిపిఓ హిమప్రభాకర్ రాజు,ఎస్ఈ ట్రాన్సకో ఉమాపతి, జడ్పి సిఈఓ నాసర రెడ్డి, డిపిఓ భాస్కర్,డిడి మైన్స్ రాజశేఖర్, డి ఎస్ ఓ రాజా రఘువీర్, పి సి బి ఈ ఈ కిషోర్ రెడ్డి,అడిషనల్ మున్సిపల్ కమీషనర్ కృష్ణ,ఎ డి మార్కెటింగ్ నారాయణ మూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు,డిఆర్డిఎ ఎపిడి పాల్గొన్నారు.