*ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) పథకం కింద మంజూరు అయ్యే నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించండి*
*జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా*
కర్నూలు, జూలై 24:- ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) పథకం మంజూరు అయ్యే నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు..
గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) పథకం అమలు పై సంబంధిత అధికారులతో కన్వర్జెన్స్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) పథకం కింద దళిత జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడం లక్ష్యం అన్నారు.. మొదటి విడతలో ఈ పథకం ద్వారా మూడు ఎంపిక చేసి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.. ఓర్వకల్లు మండలంలోని బొడ్డువానిపల్లె గ్రామం, ఆదోని మండలంలోని నారనపురం గ్రామ పంచాయతీ, చాగి గ్రామం, ఎమ్మిగనూరు మండలంలోని ఎనిగబాల గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, పనులు పూర్తి చేసిన వాటికి రెండు రోజుల్లోపు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాలని కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు..
ఈ పథకం కింద ఫేజ్ 2 లో 9 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.హోళగుంద మండలం మార్లమాడికి, కర్నూలు మండలం పసుపుల గ్రామ పంచాయతీ లోని నూతనపల్లె, పెద్దకడబూరు మండలం మ్యకదోన, ఆస్పరి మండలం నగరూర్, ఓర్వకల్లు మండలంలోని ఉప్పలపాడు, మంత్రాలయం మండలంలోని బూడూర్, గూడూరు మండలంలోని గుడిపాడు, గూడూరు మండలంలోని కే.నాగలాపురం గ్రామపంచాయతీ, కురువ నాగలాపురం గ్రామం, నందవరం మండలం మాచపురం గ్రామాలను ఎంపిక చేసి, ఈ గ్రామాల్లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. పాఠశాలల్లో, అంగన్వాడి సెంటర్లలో మరమ్మతుల పనులు, త్రాగునీటికి సంబంధించి ఫిల్టర్ బెడ్ సమస్యలు, పంచాయతీరాజ్ కి సంబంధించి అప్రోచ్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, మౌలిక సదుపాయాలు తదితర పనులను ఈ నిధులతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు...ఏదైనా పథకానికి సంబంధించి గ్యాప్ ఉన్నట్లయితే, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) నిధులు వినియోగించుకుని, ఆ గ్యాప్ ను పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
సమావేశములో జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి,సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాధిక, జల వనరుల శాఖ ఎస్ ఈ బాలచంద్రా రెడ్డి,ఐసిడిఎస్ పిడి నిర్మల, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వర రావు, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఉమాపతి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు..
--------DIPRO, KURNOOL----